అధినేతతో షేక్‌హ్యాండా? వద్దు బాబోయ్‌...

దేశాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తితో కరచాలనం అంటే ఎవరికైనా గౌరవప్రదమైనదిగా భావిస్తారు. కానీ జర్మనీలో మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా జరిగింది.

Published : 03 Mar 2020 15:21 IST

జర్మనీ ఛాన్స్‌లర్‌కి కరోనా ఎఫెక్ట్‌

బెర్లిన్‌:  అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తితో కరచాలనం అంటే ఎవరైనా గౌరవప్రదంగా భావిస్తారు. కానీ జర్మనీలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఆ దేశ రాజధాని బెర్లిన్‌లో ఓ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి హాజరుకావడానికి వచ్చిన ఆ దేశ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌.. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి హోర్స్ట్‌ సీహోఫర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వటానికి చేయి చాచారు. కానీ ఆయన షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి తన చేతిని అందించకుండా.. జస్ట్‌ ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. ఈ విధమైన ప్రతిచర్యకు ఏంజెలా ముందు ఆశ్చర్యపోయారు. అనంతరం విషయం అర్థం కావటంతో ఇద్దరూ నవ్వుకున్నారు. 

జర్మనీలో ఇప్పటి వరకూ 157 కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతరులకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని