ఇరాన్‌ రాయబారికి భారత్‌ సమన్లు

దిల్లీ ఘటనలపై ఇరాన్‌ విదేశాంగమంత్రి జవద్‌ జరీఫ్‌ చేసిన వ్యాఖ్యల్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు దిల్లీలోని ఇరాన్‌ రాయబారి అలీ చెగానికి సమన్లు జారీ చేసింది.........

Updated : 03 Mar 2020 15:30 IST

అంతర్గత విషయాల్లో జోక్యం తగదని స్పష్టం

దిల్లీ: దిల్లీ ఘటనలపై ఇరాన్‌ విదేశాంగమంత్రి జవద్‌ జరీఫ్‌ చేసిన వ్యాఖ్యల్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు దిల్లీలోని ఇరాన్‌ రాయబారి అలీ చెగానికి సమన్లు జారీ చేసింది. దిల్లీ ఘటనలపై జరీఫ్‌ వ్యాఖ్యలు ‘అనుచితమని.. అంగీకరించలేనివని’ స్పష్టం చేసింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతకుముందు దిల్లీలో జరిగిన ఘటనల్ని ఖండిస్తున్నామంటూ జరీఫ్‌ ట్విటర్‌ వేదికగా అభిప్రాయపడ్డారు. ఇరాన్‌, భారత్‌ మధ్య శతాబ్దాల నుంచి మిత్రుత్వం కొనసాగుతోందని గుర్తుచేసిన ఆయన ఎలాంటి ఘర్షణలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ అవగాహనారాహిత్య వ్యాఖ్యలు చేశారు. 

దిల్లీ ఘటనలపై పూర్తి అవగాహన లేకుండా ఇప్పటికే పాకిస్థాన్‌, ఇండోనేషియా, టర్కీ వ్యాఖ్యలు చేశాయి. వీటి సరసన ప్రస్తుతం ఇరాన్‌ కూడా చేరింది. దిల్లీ సహా ఇతర ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దని గతవారం పలు దేశాలతో పాటు ఐరాస మానవహక్కుల వంటి అంతర్జాతీయ సంస్థలకు భారత్‌ స్పష్టం చేసింది. అయినా తాజాగా ఇరాన్‌ మరోసారి ఈ వ్యాఖ్యల్ని చేయడం గమనార్హం.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు