బాధ్యులు ఏ పార్టీ వారైనా వదలొద్దు: కేజ్రీవాల్‌

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ మంగళవారం భారత ప్రధాని నరేంద్రమోదీతో ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇటీవల ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దాదాపు అరగంట పాటు ఆయన ప్రధానితో చర్చించారు.

Updated : 03 Mar 2020 17:48 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇటీవల ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దాదాపు అరగంట పాటు ఆయన ప్రధానితో చర్చించారు. సమావేశం అనంతరం కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య దిల్లీలో జరిగిన హింసాకాండకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరామన్నారు. బాధ్యులు ఏ పార్టీ వారైనా సరే వదిలిపెట్టవద్దని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. దేశ రాజధానిలో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. భాజపా నేతల విద్వేష పూరిత ప్రసంగాలపై ఏమైనా చర్చించారా? అని ప్రశ్నించగా.. ప్రత్యేకంగా అలాంటి విషయం చర్చకు రాలేదన్నారు. కరోనా వ్యాప్తిని  నివారించడంపై చర్చించామన్నారు. 

ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ దిల్లీ పోలీసుల పనితీరును అభినందించారు. ఆదివారం మరోసారి అల్లర్లపై వదంతులు వ్యాపించినా పోలీసులు సమర్థవంతంగా పరిస్థితిని అదుపు చేయగలిగారని ప్రశంసించారు.  ఈశాన్య దిల్లీలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో దాదాపు 42 మంది మరణించారు. 200 మంది గాయాల పాలయ్యారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని