ఈసారి హోలీ జరుపుకోను: మోదీ

దిల్లీ: దేశంలో కరోనా భయం నెలకొన్న సందర్భంగా ఈ సారి హోలీ పండుగలో పాల్లొననని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా వ్యాప్తి కట్టడికోసం సాధ్యమైనంత వరకు ప్రజలు గుంపులుగా ఏర్పడవద్దని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారని వెల్లడించారు.

Updated : 04 Mar 2020 17:41 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈసారి హోలీ పండుగలో పాల్గొననని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం సాధ్యమైనంత వరకు ప్రజలు గుంపులుగా ఏర్పడవద్దని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారని వెల్లడించారు. అందుకే ఈసారి ఎటువంటి హోలీ కార్యక్రమాల్లో పాల్గొననని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరక28 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని