ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది...

బ్రిటిష్‌ యువరాజు హ్యారీ ఎప్పుడు తిరిగి వచ్చినా అతనికి, కుటుంబానికి హృదయపూర్వక ఆహ్వానం ఉంటుందని బ్రిటన్‌ మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ప్రకటించారు.

Published : 04 Mar 2020 20:43 IST

ఎప్పుడైనా తిరిగిరావచ్చని ప్రిన్స్‌ హ్యారీకి తెలిపిన బ్రిటన్‌ మహారాణి

లండన్‌: బ్రిటిష్‌ యువరాజు హ్యారీ ఎప్పుడు తిరిగి వచ్చినా అతనికి, అతని కుటుంబానికి హృదయపూర్వక ఆహ్వానం ఉంటుందని బ్రిటన్‌ మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ప్రకటించారు. ఈ నెల చివర ప్రిన్స్‌ హ్యారీ, ఆయన సతీమణి మేఘాన్‌ మెర్కెల్‌లు తమ కుమారుడు ప్రిన్స్‌ ఆర్చీతో సహా రాజకుటుంబ సభ్యుల హోదాను వీడి వెళ్లనున్న నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన విడుదల చేశారు. 

ఇటీవల  ఎలిజబెత్‌,  హ్యారీతో సమావేశమయ్యారు. రాచరికాన్ని త్యజించాలన్న నిర్ణయం తరువాత బామ్మ, మనుమడు మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఈ ఆత్మీయ సమావేశంలో తొలిసారిగా వీలుచిక్కింది. ఈ సందర్భంగా హ్యారీ, మేఘన్‌ల తొమ్మిది నెలల చిన్నారి ఆర్చీ గురించి, వారి భవిష్యత్‌ ప్రణాళికలను గురించి ఇంకా అనేక విషయాలు కూడా చర్చకు వచ్చాయి. అనంతరం తన చిన్న మనుమడు హ్యారీ, రాజకుటుంబంలో అందరూ ఇష్టపడే సభ్యుడని క్వీన్‌ ఎలిజబెత్‌ వివరించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని