320అవినీతి అధికారులకు ఉద్వాసన: కేంద్రం

దిల్లీ: గడచిన ఐదు సంవత్సరాల్లో దేశంలోని దాదాపు 320మంది అవినీతి అధికారులకు ఉద్వాసన పలికామని కేంద్రం తాజాగా వెల్లడించింది. జులై 2014నుంచి ఫిబ్రవరి 2020 మధ్యకాలంలో దేశంలోని అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు అకాల పదవీవిరమణ ఇచ్చామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో వెల్లడించారు.

Published : 04 Mar 2020 23:29 IST

దిల్లీ: గడచిన ఐదు సంవత్సరాల్లో దేశంలోని దాదాపు 320మంది అవినీతి అధికారులకు ఉద్వాసన పలికామని కేంద్రం తాజాగా వెల్లడించింది. జులై 2014నుంచి ఫిబ్రవరి 2020 మధ్యకాలంలో దేశంలోని అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు పదవీవిరమణ ఇచ్చామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో వెల్లడించారు. ఫండమెంటల్‌ రూల్‌ ఎఫ్‌ఆర్‌ 56(j)నియమాల ప్రకారం, 163మంది గ్రూప్‌ ‘ఏ’, 157మంది గ్రూప్‌ ‘బీ’ అధికారులపై  ముందస్తు రిటైర్‌మెంట్‌ ప్రయోగించామని తెలిపారు. వీరిలో ముగ్గురు అఖిల భారత సర్వీసు(ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌)అధికారులు కూడా ఉండటం గమనార్హం. బుధవారం ఈ విషయమై కేంద్రమంత్రి లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని