కరోనాపై ప్రధాని రోజువారీ పర్యవేక్షణ

దేశంలోని 21 ఎయిర్‌పోర్టుల్లో మొత్తం 6 లక్షల మందికి కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు  కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు....

Published : 05 Mar 2020 00:25 IST

దిల్లీ: దేశంలోని 21 ఎయిర్‌పోర్టుల్లో మొత్తం 6 లక్షల మందికి కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు  కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రధాని మోదీ దీనిపై ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కేబినెట్‌ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టులతో పాటు నేపాల్‌, భూటాన్‌, మయన్మార్ దేశాల నుంచి సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశించిన 10 లక్షల మందికి కూడా స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. 

కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతం పుణెలో మాత్రమే వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఉందని జావడేకర్‌ తెలిపారు. మరో 15 ల్యాబ్‌లు, 19 అదనపు కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పనుందని చెప్పారు. కొన్ని దేశాలకు వీసా-ఆన్‌-అరైవల్‌ సదుపాయాన్ని నిలిపివేసినట్లు జావడేకర్‌ వెల్లడించారు. దేశంలో ఇప్పటి 28 కేసులు నమోదయ్యాయని, అందులో 16 మంది ఇటలీ దేశస్థులని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అంతకుముందు వెల్లడించారు. ఇకపై అన్ని దేశాల నుంచి వచ్చేవారికీ ప్రతి ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని