మాస్కులతో పార్లమెంటుకు..!

దిల్లీ: కరోనావైరస్‌తో దేశం మొత్తం ఇప్పటికే అప్రమత్తం కాగా, ఇటు పార్లమెంటులో కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంట్‌ సిబ్బంది ఈరోజు మాస్కులు ధరించి విధులకు హాజరయ్యారు. అంతేకాకుండా చేతులకు ప్లాస్టిక్‌ కవర్లు ధరించి స్కానింగ్‌ నిర్వహించడం కనిపించింది. 

Published : 05 Mar 2020 14:15 IST

దిల్లీ: కరోనావైరస్‌(కొవిడ్‌-19)తో దేశం మొత్తం ఇప్పటికే అప్రమత్తం కాగా, ఇటు పార్లమెంటులో కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంట్‌ సిబ్బంది ఈ రోజు మాస్కులు ధరించి విధులకు హాజరయ్యారు. అంతేకాకుండా చేతులకు ప్లాస్టిక్‌ కవర్లు ధరించి స్కానింగ్‌ నిర్వహించడం కనిపించింది. 

కరోనా దరిచేరకుండా ఉండాలంటే ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ష్యేక్‌ హ్యాండ్‌ వద్దు, నమస్తే ముద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలోనే పార్లమెంట్‌ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. ఈ రోజు పార్లమెంటుకు హాజరైన కొందరు కాంగ్రెస్‌ సభ్యులు కరచాలనం చేసుకున్నారు. అనంతరం వారు శానిటైజర్‌తో తమ చేతులను శుభ్రం చేసుకున్నట్లు సమాచారం. 

ఇక మరికొందరు పార్లమెంట్‌ సభ్యులు మాస్కులు ధరించి సభకు హాజరయ్యారు. మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్‌ సభ్యురాలు నవనీత్‌ రాణా మాస్కు ధరించి లోక్‌సభకు హాజరవడం అందర్నీ ఆకర్షించింది. లద్దాక్‌ ఎంపీ జమ్యాంగ్‌ తెసెరింగ్‌ నాంగ్యల్‌ కూడా మాస్కుతో పార్లమెంట్‌కు వచ్చారు. ఇక రాజ్యసభ సభ్యులు సుశీల్‌ కుమార్‌ గుప్త కూడా మాస్కుతో సభకు హాజరుకావడం విశేషం. ముందస్తు చర్యల్లో భాగంగా పార్లమెంట్‌ ఆవరణలో థర్మల్‌ స్క్రీనింగ్‌ కూడా ఏర్పాటు చేయాలని చైర్మన్‌ను కోరినట్లు వెల్లడించారు. 


 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని