ఏళ్ల తర్వాత ఇడ్లిబ్‌లో ప్రశాంత వాతావరణం!

సైనిక ఘర్షణలతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. టర్కీ, రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పదం కుదరడమే దీనికి కారణం..........

Updated : 06 Mar 2020 13:47 IST

మాస్కో: సైనిక ఘర్షణలతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. టర్కీ, రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడమే దీనికి కారణం. తరచూ సైనిక దాడులతో ఈ ప్రాంతంలో మానవత్వ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య ఆరుగంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వైమానిక ఘర్షణలకు స్వస్తి పలికి ఈ ప్రాంతంలోని పౌరులకు భయాందోళన నుంచి విముక్తి కల్పించాలి. గత కొన్నేళ్లుగా లక్షలాది మంది పౌరులు ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లిపోయారు. పలువురు టర్కీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని