దిల్లీ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు వద్దు

రోనా వైరస్‌ ప్రభావం భారత్‌లోనూ పెరుగుతుండటంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు వేగవంతం చేశాయి. దిల్లీలోని వివిధ కార్యాలయాల్లో బయో మెట్రిక్‌ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ అన్ని శాఖలను ఇప్పటికే ఆదేశించిన దిల్లీ...

Published : 06 Mar 2020 21:28 IST

దిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌లోనూ పెరుగుతుండటంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు వేగవంతం చేశాయి. దిల్లీలోని వివిధ కార్యాలయాల్లో బయో మెట్రిక్‌ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ అన్ని శాఖలను ఇప్పటికే ఆదేశించిన దిల్లీ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉదయం ప్రార్థనలను రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

‘‘ఉదయం స్కూల్‌ అసెంబ్లీని నిర్వహించవద్దు. అంతేకాకుండా పాఠశాలల్లో ఉపాధ్యాయుల బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేయండి.’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు దిల్లీలో అన్ని ప్రాథమిక పాఠశాలలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించారు. 6 నుంచి 10 తరగతులు విద్యార్థులు మాత్రం హాజరుకావాల్సి ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31  కరోనా కేసులు నమోదు కాగా..కేవలం దిల్లీలోనే ముగ్గురికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని