అఫ్గాన్‌ సీఈవోపై దాడి

అఫ్గానిస్థాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (సీఈవో) అబ్దుల్లా అబ్దుల్లా లక్ష్యంగా దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ దేశ రాజధాని కాబూల్‌లో జరిగిన ఓ

Published : 06 Mar 2020 19:20 IST

తృటిలో తప్పించుకున్న అబ్దుల్లా అబ్దుల్లా 

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (సీఈవో) అబ్దుల్లా అబ్దుల్లా లక్ష్యంగా దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ దేశ రాజధాని కాబూల్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో ప్రసంగించిన అనంతరం ఆయనపై ఈ దాడి జరిగింది. సమావేశంలో పాల్గొన్న వారిలో అబ్దుల్లాతో సహా, అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, శాంతి స్థాపక కౌన్సిల్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ కరీం ఖలీల్‌, డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మహమ్మద్‌ మొహైక్‌, ఇతర రాజకీయ నేతలు ఉన్నారు. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి సాయుధుడైన ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. ఘటన అనంతరం అబ్దుల్లా, కర్జాయ్‌, ఖలీల్‌లను గట్టి భద్రత మధ్య అక్కడి నుంచి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని