రాహుల్‌ గాంధీకీ కరోనా స్క్రీనింగ్‌..!

దిల్లీ:  ఇటీవలే విదేశీ పర్యటన చేసిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి దిల్లీ విమానాశ్రయంలో కరోనా స్క్రీనింగ్‌ నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈమధ్యే ఇటలీకి వెళ్లివచ్చిన రాహుల్‌ గాంధీ కరోనా స్క్రీనింగ్‌ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Published : 07 Mar 2020 11:13 IST

దిల్లీ: ఇటీవలే విదేశీ పర్యటన చేసిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి దిల్లీ విమానాశ్రయంలో కరోనా స్క్రీనింగ్‌ నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ మధ్యే ఇటలీకి వెళ్లి వచ్చిన రాహుల్‌ గాంధీ కరోనా స్క్రీనింగ్‌ చేయాలని భాజపా నాయకులు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఎంపీలు చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత ఉన్నప్పటికీ రాహుల్‌ గాంధీ ఎయిర్‌పోర్టులో కరోనా స్క్రీనింగ్‌ చేయించుకున్నారని తెలిపింది. ఫిబ్రవరి 29న విదేశీ తిరుగు ప్రయాణంలో భాగంగా రాహుల్‌ గాంధీ దిల్లీ ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికులకు చేసే స్క్రీనింగ్‌లో పాల్గొన్నట్లు వెల్లడించింది. తనతో భద్రతను పక్కన పెట్టిన రాహల్‌ గాంధీ సాధారణ ప్రయాణికులతో అరగంటపాటు క్యూలో నిలబడి స్క్రీనింగ్‌లో పాల్గొన్నారని స్పష్టం చేసింది.

ఇటలీలో ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభన కారణంగా దాదాపు 80మంది మరణించడంతో పాటు 2వేల కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలోనే రాహుల్‌ గాంధీ కూడా ఇటలీ పర్యటన చేసిన నేపథ్యంలో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని భాజపా నేతలు పట్టుబట్టారు. అంతేకాకుండా కరోనా వైరస్‌పై రాహుల్‌ గాంధీ తగు జాగ్రత్తలు పాటించలేదనే అనుమానం వ్యక్తం చేశారు. దీనిని ఖండించిన కాంగ్రెస్‌ పార్టీ నియమాలను రాహల్‌ గాంధీ పాటించారని స్పష్టం చేశారు. మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతోందని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 31కరోనా కేసులు నమోదుకాగా, వీరిలో 16మంది ఇటలీ పర్యాటకులు కావడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని