జయప్రదపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌..! 

రాంపూర్‌(ఉత్తర్‌ప్రదేశ్‌): బీజేపీ నేత, ప్రముఖ సినీ నటీ జయప్రదపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. గత ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిందనే ఆరోపణలపై నమోదైన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌ కోర్టు ఈ వారెంట్‌ జారీ చేసింది.

Published : 07 Mar 2020 13:37 IST

రాంపూర్‌(ఉత్తర్‌ప్రదేశ్‌): భాజపా నేత, ప్రముఖ సినీ నటి జయప్రదపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. గత ఎన్నికల్లో నియమావళిని ఉల్లఘించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌ కోర్టు ఈ వారెంట్‌ జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో నమోదైన ఈ ఉల్లంఘన కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20న జరగనుంది. గత ఎన్నికల్లో రాంపూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసిన జయప్రద సమాజ్‌వాద్‌ పార్టీ అభ్యర్థి అజాం ఖాన్‌ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని