కేరళలో మూడేళ్ల చిన్నారికి కరోనా

దేశంలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కేరళలో ఓ మూడేళ్ల చిన్నారికి కరోనా సోకింది. ఆ పాప తన కుటుంబంతో కలిసి ఇటీవల ఇటలీ వెళ్లినట్లు తెలిసింది. మార్చి 7న వారు భారత్‌కు

Updated : 09 Mar 2020 10:48 IST

తిరువనంతపురం: దేశంలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కేరళలో ఓ మూడేళ్ల చిన్నారికి కరోనా సోకింది. ఆ చిన్నారి తన కుటుంబంతో కలిసి ఇటీవలే ఇటలీ వెళ్లినట్లు తెలిసింది. మార్చి 7న వారు భారత్‌కు తిరిగిరాగా.. కోచి ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్‌ నిర్వహించిన అధికారులు కరోనా అనుమానంతో చిన్నారి, తన తల్లిదండ్రులను వేరుగా ఉంచారు. వారి రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. తాజాగా చిన్నారికి కరోనా సోకినట్లు తేలడంతో సోమవారం ఎర్నాకుళం మెడికల్‌ కాలేజీలోని ఐసోలేషన్‌ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తల్లిదండ్రుల మెడికల్‌ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. 

మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్‌కు చెందిన ఓ మహిళకూ కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. సదరు మహిళ ఇటీవల ఇరాన్‌ వెళ్లి వచ్చినట్లు సమాచారం. తాజా కేసులతో భారత్‌లో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 41కి పెరిగింది. ఇక కరోనా భయంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
ఈజిప్టులో తొలి మరణం..
ఈజిప్టులో కరోనా తొలి మరణం నమోదైంది. ఈ దేశంలో పర్యటిస్తున్న 60ఏళ్ల జర్మనీ పర్యాటకుడు కరోనా వైరస్‌ కారణంగా మృతిచెందినట్లు ఈజిప్టు ఆరోగ్య మంత్రి వెల్లడించారు. సదరు పర్యాటకుడు ఇటీవల అనారోగ్యానికి గురవడంతో మార్చి 6న ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆదివారం అతడు మృతిచెందాడు. 

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్‌.. ఉల్లంఘిస్తే మూడు నెలలు జైలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని