క్షేమంగానే సౌదీ రాజు సల్మాన్‌..!

రియాద్‌: సౌదీఅరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు సౌదీ రాయల్‌ కోర్టు వెల్లడించింది. సల్మాన్‌ మరణించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంటూ సల్మాన్‌ తాజా ఫోటోలను విడుదల చేసింది.

Published : 09 Mar 2020 15:12 IST

 

రియాద్‌: సౌదీఅరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు సౌదీ రాయల్‌ కోర్టు వెల్లడించింది. సల్మాన్‌ మరణించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంటూ సల్మాన్‌ తాజా ఫోటోలను విడుదల చేసింది. అతను ఆరోగ్యంగా ఉంటూ రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపింది. అదే రాజకుటుంబానికి చెందిన రాజకుమారుడి అరెస్టుతో సల్మాన్‌ ఆరోగ్యం క్షీణించిందనే పుకార్లు వచ్చాయి. అయితే తండ్రి మద్దతుతో కీలక బాధ్యతలు చేపట్టిన రాజకుమారుడు, సన్నిహితులు మాత్రం సల్మాన్‌కు మద్దతు తెలపకపోవడంతో పాటు తిరుగుబాటుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే సల్మాన్‌ కుమారుడితోపాటు మరో ఇద్దరిని రాజద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలా రాజకుటుంబంలోని వారితోపాటు రాజుకు అత్యంత సన్నిహితులను కూడా అరెస్టు చేయడం ద్వారా ఎవరైనా తప్పుచేస్తే అధికారం కోల్పోవాల్సివస్తుందనే సంకేతాలను రాజకుటుంబం పంపింది.

అయితే ఈ సమయంలోనే 84ఏళ్ల వయసున్న సౌదీ రాజు సల్మాన్ ఆరోగ్యంపై పలు వార్తలు వస్తున్నాయి. వీటిని ఖండించిన రాయల్‌ కోర్టు.. సల్మాన్‌ పూర్తి ఆరోగ్యంగా ఉంటూ రోజూవారీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని స్పష్టం చేసింది. తాజాగా రాజు సల్మాన్‌ అధికారికంగా ఇద్దరు దౌత్య అధికారులను కలుసుకున్న ఫోటోలను విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని