ఖతర్‌కు ఇండిగో సర్వీసులు రద్దు

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీయుల రాకపై ఖతర్‌ తాత్కాలిక నిషేధం విధించింది. ఇందులో భారత్‌తో పాటు మరో 13 దేశాలున్నాయి. ఖతర్ విధించిన నిషేధంతో

Published : 09 Mar 2020 23:51 IST

ముంబయి: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీయుల రాకపై ఖతర్‌ తాత్కాలిక నిషేధం విధించింది. ఇందులో భారత్‌తో పాటు మరో 13 దేశాలున్నాయి. ఖతర్ విధించిన నిషేధంతో మార్చి 17 వరకు ఆ దేశ రాజధాని దోహాకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సోమవారం ప్రకటించింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, నిషేధం ఎత్తివేసిన తర్వాత మరిన్ని అప్‌డేట్స్‌ ఇస్తామని తెలిపింది.

తాజాగా ఖతర్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇరు దేశాల మార్కెట్లు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది. భారత్‌ నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించే గమ్యస్థానాల్లో ఖతర్‌ ఒకటి. ప్రతి త్రైమాసికంలో ఈ రెండు దేశాల మధ్య సుమారు ఒక మిలియన్ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎయిర్ ఇండియా, ఇండిగోతో పాటు స్పైస్ జెట్ సహా చాలా విమానయాన సంస్థలు దోహాకు విమానాలు నడుపుతున్నాయి. దోహాలో దాదాపు ఏడు లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకూ భారత్‌లో 43 కరోనా కేసులు నమోదవగా.. ఖతర్‌లో 12 కేసులను అధికారులు నిర్ధారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని