మీ స్క్రీన్‌మీదే రంగుల హోలీ..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోళీని ప్రజలు ఆనందోత్సవాల నడుమ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో ప్రముఖ ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ కూడా సరికొత్త డూడుల్‌తో ముందుకొచ్చింది. వివిధ రంగులతో తమ మొబైల్‌, డెస్క్‌టాప్‌ స్క్రీన్‌లపై రంగులు కురిపిస్తోంది.

Published : 10 Mar 2020 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీని ప్రజలు ఆనందోత్సవాల నడుమ జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ కూడా సరికొత్త డూడుల్‌తో ముందుకొచ్చింది. వివిధ రంగులతో తమ మొబైల్‌, డెస్క్‌టాప్‌ స్క్రీన్‌లపై రంగులు కురిపిస్తోంది. దీనికోసం గూగుల్‌ సెర్చ్‌బార్‌ కింద ఉన్న ‘హ్యాపీ హోలీ’ అనే డూడుల్‌ని క్లిక్‌ చేయడం లేదా సెర్చ్‌లో ‘Holi’ అని టైపు చేస్తే చాలు. కుడివైపున హోలీకి సంబంధించిన ఫోటోలు, సమాచారంతోపాటు పక్కనే ఒక షేర్‌ బటన్‌ వస్తుంది. దానిపక్కన మూడు రంగుల్లో ఉన్న మరో బటన్‌ క్లిక్‌ చేయాలి. ఇంకేముంది, మీరు స్క్రీన్‌పై ఎక్కడ క్లిక్‌ చేస్తే అక్కడ హోలీ రంగులు ప్రత్యక్షమౌతాయి. దీంతో మీ స్క్రీన్‌ మొత్తం రంగులమయమవుతుంది. ఆ రంగులు పోవాలంటే మాత్రం పైన కనిపించే రీఫ్రెష్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి. 

ఆలస్యం ఎందుకు..ట్రై చేయండి మరి..!!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని