కేంద్రమంత్రి ‘కరోనా గో’ వీడియో వైరల్‌

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) కేసులు భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పలు చర్యలు చేపడుతోంది..........

Updated : 06 Aug 2020 13:10 IST

ముంబయి: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) కేసులు భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పలు చర్యలు చేపడుతోంది. ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముంబయిలో కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే, చైనా కాన్సుల్‌ జనరల్‌ టాంగ్‌ గుకాయ్‌తో పాటు పలువురు బౌద్ధ సన్యాసులు చైనాలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటూ గత నెలలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ‘గో కరోనా.. గో కరోనా’ అంటూ ఫిబ్రవరి 20న ముంబయిలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద వీరంతా కలిసి చేసిన నినాదాల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

గతేడాది డిసెంబర్‌ మాసంలో చైనాలోని వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ ప్రబలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 90కి పైగా దేశాలకు వ్యాప్తి చెంది 4013 మంది ప్రాణాలను బలితీసుకుంది. 1,13,634 మంది ఈ వైరస్‌తో బాధపడుతున్నారు. దీని భయంతో చైనా, ఇటలీతో పాటు పలు దేశాల్లో కోట్లాది మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు సైతం భయపడుతున్నారు. ఈ వైరస్‌ ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని