కేరళలో మార్చి 31 వరకు థియేటర్ల మూసివేత

కరోనా వైరస్‌ కారణంగా కేరళలో రేపటి నుంచి సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. ఈ మేరకు మలయాళ సినిమా సంస్థలు మంగళవారం కొచ్చిలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి మొదలై మార్చి 31 వరకు థియేటర్ల మూసివేత కొనసాగుతుందని వారు తెలిపారు.

Published : 11 Mar 2020 00:35 IST

కొచ్చి: కరోనా వైరస్‌ కారణంగా కేరళలో రేపటి నుంచి సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. ఈ మేరకు మలయాళ సినిమా సంస్థలు మంగళవారం కొచ్చిలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి మొదలై మార్చి 31 వరకు థియేటర్ల మూసివేత కొనసాగుతుందని వారు తెలిపారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. కేరళలో తాజాగా ఆరు కరోనా కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కేరళలో వైరస్‌ పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 12కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను, పాఠశాలలను మార్చి 31 వరకు మూసివేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రజలు బహిరంగ సమావేశాలు, ఇతరత్రా బహిరంగ ఉత్సవాలకు మార్చి 31వరకు దూరంగా ఉండాలని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని