పాకిస్థాన్‌లో కుప్పకూలిన ఎఫ్‌ -16 విమానం

పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (పీఏఎఫ్‌)కు చెందిన ఎఫ్‌ 16 యుద్ధ విమానం కూలిపోయింది. మార్చి 23న పాకిస్థాన్‌ డే సందర్భంగా నిర్వహించబోయే పరేడ్‌ కోసం చేపట్టిన రిహాల్స్‌లో........

Published : 12 Mar 2020 01:01 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (పీఏఎఫ్‌)కు చెందిన ఎఫ్‌ 16 యుద్ధ విమానం కుప్పకూలింది. మార్చి 23న పాకిస్థాన్‌ డే సందర్భంగా నిర్వహించబోయే పరేడ్‌ కోసం చేపట్టిన రిహార్సల్స్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇస్లామాబాద్‌లోని షెకర్‌పారియన్‌ సమీపంలో ఈ దుర్ఘటన జరగ్గా.. సహాయక బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఈ విమానంలో పైలట్‌ నుమాన్‌ అక్రమ్‌ మృతిచెందినట్టు సమాచారం.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే, ఈ విమానం కుప్పకూలడానికి ముందే పైలట్లు సురక్షితంగా బయటపడి ఉంటారని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయనీ.. ఆ వార్తలు నిజం కావాలని కోరుకుంటున్నట్టు పాక్‌ మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్‌ మజారీ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని