ఇరాక్‌లో సాయుధముఠాపై అమెరికా దాడులు

ఇరాక్‌లోని అన్బర్‌ ప్రావిన్స్‌లోని స్థానిక సాయుధ ముఠాల స్థావరాలపై అమెరికా గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. బుధవారం అక్కడి సాయుధ ముఠాలు జరిపిన రాకెట్ దాడుల్లో ఇద్దరు

Updated : 12 Mar 2020 11:53 IST

బాగ్దాద్: ఇరాక్‌లోని అన్బర్‌ ప్రావిన్స్‌లోని స్థానిక సాయుధ ముఠాల స్థావరాలపై అమెరికా గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. బుధవారం అక్కడి సాయుధ ముఠాలు జరిపిన రాకెట్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో సహా మొత్తం ముగ్గురు సైనికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతిదాడులకు దిగింది. ‘‘ఇరాక్‌లోని తాజి మిలిటరీ స్థావరంపై 15కి పైగా చిన్న రాకెట్లలతో దాడి చేశారు’’ అని అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాల ప్రతినిధి మైల్స్‌ కాగ్గిన్స్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.  సాయుధ ముఠా చేసిన రాకెట్‌ దాడిలో సంకీర్ణ దళాలకు చెందిన ముగ్గరు సైనికులు మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాక్‌ కాలమానం ప్రకారం మార్చి 11న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రతిదాడి చేసినట్లు  ఆయన వెల్లడించారు. అయితే ఈ దాడి ఘటనలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు కాగ్గిన్స్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు