నమస్తే అంటున్న ప్రిన్స్‌ చార్లెస్‌

కరోనా భయం సాధారణ ప్రజల నుంచి ప్రపంచ నాయకుల వరకు అందరినీ వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరాన్‌లో ఎంపీలు, బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఈ వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఒకరితో....

Published : 13 Mar 2020 01:19 IST

లండన్‌: కరోనా భయం సాధారణ ప్రజల నుంచి ప్రపంచ నాయకుల వరకు అందర్నీ వెంటాడుతోంది. ఇప్పటికే ఇరాన్‌లో ఎంపీలు, బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఈ వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఒకరితో ఒకరు చేయి కలిపేందుకు భయపడుతున్నారు. వైద్యులు కూడా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే కరచాలనం చేయొద్దని సూచించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్‌ చార్లెస్‌ నమస్తే పెడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రిన్స్‌ చార్లెస్‌ కారు దిగి వచ్చే సందర్భంలో ఆయన అక్కడున్న వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు చేయి చాపారు. అయి అక్కడున్న వ్యక్తి ఆయన చెవిలో ఏదో చెప్పటంతో ఆయన షేక్‌హ్యాండ్ ఆపేసి నమస్తే పెట్టడం వీడియోలో కనిపించింది. అక్కడున్న మరో ఇద్దరు కూడా ఆయన్ను అదే విధంగా విష్ చేయడంతో ప్రతిగా ఆయన కూడా నమస్తే చెప్తారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రవీణ్‌ కశ్వాన్‌ అనే ఫారెస్ట్‌ ఆఫీసర్‌ తన ట్విటర్‌ ఖాతా షేర్‌ చేస్తూ ‘‘భారతీయులు ఈ పద్ధతిని పాటించాలని ఎన్నో ఏళ్ల క్రితం చెప్పారు. అయితే ఇప్పుడు నమస్తే సరిగా ఎలా పెట్టాలని చిన్న క్లాస్‌ నిర్వహించాలి’’ అని ట్వీట్‌ చేశారు. ఆయన షేర్‌ చేసిన వీడియోని చూసిన నెటిజన్లు ‘హలో వరల్డ్‌ నుంచి నమస్తే వరల్డ్‌’, ‘యోగా తర్వాత నమస్తేనే అతి పెద్ద ఎగుమతి’, ‘మన పూర్వీకులది ఎంత ముందు చూపో’ అని కామెంట్లు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు