సింధియాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం షాక్‌ 

కాంగ్రెస్‌ పార్టీ నుంచి భాజపాలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఈ మేరకు గతంలో ఆయన మీద పెండింగ్‌లో ఉన్న ఓ ఫోర్జరీ కేసులో వాస్తవాలను విచారించాలని.....

Published : 13 Mar 2020 14:53 IST

భోపాల్‌:  కాంగ్రెస్‌ పార్టీ నుంచి భాజపాలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఈ మేరకు గతంలో ఆయన మీద పెండింగ్‌లో ఉన్న ఓ ఫోర్జరీ కేసులో వాస్తవాలను విచారించాలని మధ్యప్రదేశ్‌ ఆర్థిక నేరాల విభాగాన్ని (ఈఓడబ్ల్యూ) ఆదేశించింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో మహాల్గావ్‌లో ఓ భూమిని పత్రాల్లో ఉన్న దాని కంటే 6,000 చదరపు అడుగులు తక్కువగా చూపి తనకు విక్రయించారని సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి మార్చి 26, 2014న సింధియా, ఆయన కుటుంబంపై ఫిర్యాదు చేశాడని ఈఓడబ్ల్యూ తెలిపింది. అయితే ఆ కేసులో విచారణను 2018లో నిలిపివేశారు. తాజాగా ఈ కేసును విచారించాలని శ్రీవాస్తవ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వాస్తవాలను విచారించాలని తమకు ఆదేశాలు అందాయని ఈఓడబ్ల్యూ అధికారి ఒకరు తెలిపారు. 

దీనిపై సింధియా సహాయకుడు పంకజ్‌ చతుర్వేది మాట్లాడుతూ ‘‘ఇది రాజకీయ కుట్ర. కేవలం ప్రతీకారం కోసమే ఈ కేసును తిరిగి తెరిచారు. మాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది.  తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది. దీనికి కమల్‌నాథ్‌ ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి’’ అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సింధియా బుధవారం భాజపాలో చేరారు. పార్టీలో చేరిన కొద్ది గంటల్లోనే భాజపా ఆయన్ను మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్‌ ప్రభుత్వం కష్టాల్లో పడింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని