దిల్లీ హైకోర్టులో నిర్భయ దోషి పిటిషన్‌

నిర్భయ హత్యాచారం కేసులో మరికొన్ని రోజుల్లో ఉరిశిక్ష అమలు కానున్న వేళ దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ.....

Published : 13 Mar 2020 18:38 IST

దిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులో మరికొన్ని రోజుల్లో ఉరిశిక్ష అమలు కానున్న వేళ దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ విషయంలో విధానపరమైన లోపాలు చోటు చేసుకున్నాయని పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ మేరకు అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ హైకోర్టు రిజిస్ట్రీ వద్ద పిటిషన్‌ వేశారు.

తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలంటూ దిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్‌ రాష్ట్రపతికి పంపిన సిఫార్సుల్లో ఆయన సంతకం లేదని వినయ్‌ శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అలాగే క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి వద్దకు చేరినప్పుడు దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమల్లో ఉందని, దాని ప్రకారం ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని తెలిపాడు. క్షమాభిక్ష తిరస్కరణ విషయంలో రాజ్యాంగ పరంగా అవతవకలు జరిగాయని, అందరికీ న్యాయం జరగాలన్న రాజ్యాంగ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని తన పిటిషన్‌ వాదనపై వీలైనంత తొందరగా విచారణ జరపాలని పేర్కొన్నాడు.

వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫిబ్రవరి 1న తిరస్కరించారు. కాగా, నిర్భయ దోషులకు ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలంటూ పటియాలా హౌస్‌కోర్టు ఈ నెల 5న డెత్‌వారెంట్లు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు