ఆచూకీ దొరకని 335 మంది ప్రయాణికులు

కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 335 మంది ప్రయాణికుల ఆచూకీ దొరకలేదని పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 13 వరకు 6,011 మంది ప్రయాణికులు కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చారని ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి.

Updated : 15 Mar 2020 06:29 IST

చండీగఢ్‌: కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 335 మంది ప్రయాణికుల ఆచూకీ దొరకలేదని పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 13 వరకు 6,011 మంది ప్రయాణికులు కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చారని ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. వారిలో కరోనా లక్షణాలున్న 90 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయగా 85 మంది కరోనా నెగెటివ్‌గా తేలింది. మిగిలిన ఐదుగురి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 84కు చేరింది. అందులో 67 మంది భారతీయులు ఉండగా 17 మంది విదేశీయులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని