విమానంలోకి కరోనా వ్యక్తి.. ఏం చేశారంటే..!

కరోనా వైరస్‌ సోకిన ఓ వ్యక్తి విమానంలోకి ఎక్కడంతో అందులో ఉన్న 289 మంది ప్రయాణికుల్ని దింపేయాల్సి వచ్చింది. ఈ ఘటన కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో జరిగింది..........

Published : 15 Mar 2020 14:17 IST

కొచ్చి: కరోనా వైరస్‌ సోకిన ఓ వ్యక్తి విమానంలోకి ఎక్కడంతో అందులో ఉన్న 289 మంది ప్రయాణికుల్ని దింపేయాల్సి వచ్చింది. ఈ ఘటన కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌ నుంచి వచ్చిన 19 మంది పర్యాటకుల బృందం కేరళలోని మున్నార్‌లో సందర్శిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వీరిని అధికారులు కొన్ని రోజుల పాటు మున్నార్‌లోనే ఓ ప్రత్యేక కేంద్రంలో ఉంచారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. ఇంతలో ఆ బృందం అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కొచ్చి విమానాశ్రయానికి చేరుకొని దుబాయ్‌కి వెళుతున్న ఎమిరేట్స్ విమానాన్ని ఎక్కారు. ఈలోపు వారి వైద్య పరీక్షల ఫలితాలు వచ్చాయి. వారిలో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతని కోసం గాలించగా.. విమానాశ్రయం చేరుకున్నట్లు తెలిసింది. హుటాహుటిన విమానాశ్రయ సిబ్బందికి సమాచారం చేరవేయగా వారిని విమానం నుంచి కిందకు దింపేశారు. తొలుత ఆ 19 మందినే ఆపాలనుకున్నా.. ముందు జాగ్రత్త చర్యగా విమానంలో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని