అమెరికాకు ‘జాక్‌ మా’ సాయం..!

బీజింగ్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గ్గజం అలీబాబా సహవ్యవస్థాపకుడు ‘జాక్‌ మా’ ఇప్పటికే భారీ విరాళాన్ని ప్రకటించారు. తాజాగా ట్విటర్‌లో ఖాతా తెరచిన ‘జాక్‌ మా’ అమెరికాకు మాస్కులను, కరోనా పరీక్షల కిట్‌లను పంపిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. 

Published : 17 Mar 2020 01:49 IST

బీజింగ్‌: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గ్గజం ఆలీబాబా సహ వ్యవస్థాపకుడు ‘జాక్‌ మా’ ఇప్పటికే భారీ విరాళాన్ని ప్రకటించారు. తాజాగా ట్విటర్‌లో ఖాతా తెరిచిన ‘జాక్‌ మా’ అమెరికాకు మాస్కులను, కరోనా పరీక్షల కిట్‌లను పంపిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. అమెరికాలో ఉన్న మిత్రులందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అంటూ మొదటి ట్విట్‌ చేసిన స్వల్ప వ్యవధిలోనే భారీగా అభిమానులు స్పందించారు. జాక్‌ మా ఫౌండేషన్‌, ఆలీబాబా ఫౌండేషన్‌ కలిసి ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడిన దేశాలకు వైద్యపరికరాలతో పాటు వివిధ రూపాల్లో సహాయం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ దేశాలకు విరాళాన్ని అందించాయి. తాజాగా కరోనా తీవ్రత ఎక్కువున్న అమెరికాకు దాదాపు 5లక్షల కిట్లను, పది లక్షల మాస్కులకు ప్రత్యేక విమానంలో పంపించారు. దీంతో తమకు చేస్తున్న సాయానికి జాక్‌ మా ను చాలామంది అమెరికన్లు అభినందిస్తుండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ‘జాక్‌ మా’ తమ సామాజిక మాధ్యమంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ట్విటర్‌ సీఈఓ కూడా స్పందించడం కొసమెరుపు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని