ఆ ముగ్గురికి 125 ఏళ్ల జైలుశిక్ష

శరణార్థుల పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉంటుందో.. సముద్రతీరానికి కొట్టుకొచ్చిన మూడేళ్ల చిన్నారి అలెన్‌ కుర్దీ మృతి ప్రపంచానికి తెలియజేసింది. సరిగ్గా సెప్టెంబర్‌ 2, 2015లో సముద్ర తీరంలో

Published : 17 Mar 2020 01:50 IST

అంకారా: శరణార్థుల పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉంటుందో.. సముద్రతీరానికి కొట్టుకొచ్చిన మూడేళ్ల చిన్నారి అలెన్‌ కుర్దీ మృతి ప్రపంచానికి తెలియజేసింది. సరిగ్గా సెప్టెంబర్‌ 2, 2015లో సముద్ర తీరంలో అచేతనంగా పడి ఉన్న చిన్నారి కుర్దీ చిత్రం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్‌ అయింది. గుండెను కదిలించేలా ఉన్న ఈ చిత్రం బయటకొచ్చాకే ప్రపంచదేశాలు శరణార్థుల సమస్యపై స్పందించాయి. అగ్ర దేశాలు శరణార్థుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుసుకున్నాయి. ఈ దయనీయఘటన జరిగిన నాలుగున్నరేళ్లకి టర్కిష్‌ కోర్టు తాజాగా ఓ  కీలక తీర్పును వెల్లడించింది. మానవ అక్రమ రవాణా చేస్తూ కుర్దీతో సహా మరికొందరి మరణానికి కారణమైన ముగ్గురికి 125 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కుర్దీ కుటుంబం టర్కీ నుంచి గ్రీకు చేరుకోవాలనుకునే క్రమంలో 8 మంది పరిమితి కలిగిన ఒక ప్లాస్టిక్‌ బోట్‌లో 16 మందిని ఎక్కించి ఈ ప్రమాదం జరిగేందుకు కారకులయ్యారు. ఆ బోటు తీరం నుంచి కదిలిన కొన్ని నిమిషాలకే సముద్రంలో మునిగిపోయింది. ఒక్క కుర్దీ కుటుంబాన్ని అక్రమంగా తరలించేందుకే వారు 6వేల డాలర్లు వసూలు చేశారు. వీరి ముగ్గురితో పాటు మరికొంత మంది అక్రమ రవాణా చేసే వారిని అరెస్ట్‌ చేసి జైలు శిక్ష విధించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని