సునామీ రాబోతోంది: రాహుల్‌ గాంధీ

కరోనా వైరస్‌తో పాటు మరో ఆరు నెలల్లో రాబోయే భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ హెచ్చరించారు........

Published : 17 Mar 2020 22:49 IST

దిల్లీ: కరోనా వైరస్‌తో పాటు మరో ఆరు నెలల్లో రాబోయే భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన ఆర్థిక ఇబ్బందుల్ని సునామీతో పోల్చారు. గతంలో సునామీ సృష్టించిన ఉత్పాతామే మరోసారి ప్రజలు చూడబోతున్నారని వ్యాఖ్యానించారు. దీంతో మరో ఆరు నెలల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోనున్నారని జోస్యం చెప్పారు. ఈ విషయాన్ని గత కొన్ని రోజులుగా తాను ప్రభుత్వానికి గుర్తుచేస్తూనే ఉన్నానన్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతోందన్నారు. 

అలాగే లోక్‌సభలో ఎంపీలు ప్రాంతీయ భాషల అంశంపై మాట్లాడడానికి అనుమతించకపోవడం తప్పని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఈరోజు కాంగ్రెస్‌, ఎన్సీపీ, డీఎంకేకు చెందిన ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు. సప్లిమెంటరీ ప్రశ్నలు అడగడానికి తమను అనుమతించడం లేదని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని