అక్కడి ఆర్టీసీ బస్సులు శానిటైజ్‌తో శుభ్రం..!

దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావంతో నిత్యం ప్రజలతో అనుబంధం ఉండే అన్ని విభాగాలు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటున్నాయి....

Published : 17 Mar 2020 22:57 IST

కర్ణాటక: దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావంతో నిత్యం ప్రజలతో అనుబంధం ఉండే అన్ని విభాగాలు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ప్రజా రవాణా సంస్థలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. మొదటిసారిగా కర్ణాటక రాష్ట్ర రోడ్డ్డు రవాణా సంస్థ రాష్ట్రంలోని అన్ని లగ్జరీ బస్సులకు శానిటైజ్‌ చేయాలని నిర్ణయించింది. ఈ బస్సులు ప్రతిరోజు వివిధ రాష్ట్రాలకు వెళ్లి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సులు డిపోకు చేరుకున్న వెంటనే, మళ్లీ బయటకు వెళ్ళే సమయంలో తమ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు. 

ఇదే తరహాలో బిహార్‌ ఆర్‌టీసీ కూడా చర్యలు తీసుకుంటోంది. పట్నా మున్సిపల్‌ కార్పోరేషన్‌ సహాయంతో తమ బస్సులను శానిటైజ్‌ చేస్తున్నామని తెలిపారు. ఇలా ఆయా రాష్ట్రాల్లో ఆర్‌టీసీ తీసుకుంటున్న చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా సాధారణ బస్సులను కూడా శుభ్రం చేయాలని కోరుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 126 కొవిడ్‌-19 కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. కర్ణాటకలో ఇప్పటికే 8 కరోనా కేసులు నమోదుకాగా ఓవ్యక్తి చనిపోయాడు. బిహార్‌లో ఇప్పటివరకు ఒక్కకేసు కూడా నమోదుకానప్పటికీ.. అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని