విదేశాల్లోని 276మంది భారతీయులకు కరోనా!

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌నూ వెంటాడుతోంది. దేశంలో కొవిడ్‌-19కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా..విదేశాల్లో ఉన్న 276మంది భారతీయులకు కరోన సోకినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది.

Updated : 17 Aug 2022 12:29 IST

దిల్లీ: ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌నూ వెంటాడుతోంది. దేశంలో కొవిడ్‌-19కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా..విదేశాల్లో ఉన్న 276మంది భారతీయులకు కరోన సోకినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. వీరిలో 255మంది ఒక్క ఇరాన్‌లో చిక్కుకున్నవారు కాగా, 12మంది యూఏఈలో, ఐదుగురు ఇటలీలో ఉన్నట్లు తెలిపింది. ఇక హాంకాంగ్‌, కువైట్‌, రువాండా, శ్రీలంక దేశాల్లో ఒక్కరు చొప్పున భారతీయులు కరోనా బారినపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే మనదేశంలో 150మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరిలో 25మంది విదేశీయులు ఉండగా మిగతావారు భారత పౌరులే. ఇప్పటి వరకూ ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని