కరోనాను జయించిన 103 ఏళ్ల బామ్మ

చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో సతమతమౌతున్నవేళ 103 ఏళ్ల వయసున్న ఓ బామ్మ కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. వివరాల్లోకి వెళితే.....

Published : 19 Mar 2020 01:35 IST

టెహ్రాన్‌(ఇరాన్‌): చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో సతమతమౌతున్నవేళ 103 ఏళ్ల వయసున్న ఓ బామ్మ కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. వివరాల్లోకి వెళితే ఇరాన్‌లోని సెమ్‌నాన్‌ సెంట్రల్‌ సిటీకి చెందిన 103 ఏళ్ల వృద్ధురాలికి కరోనా వైరస్‌ సోకడంతో వారం క్రితం ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం ఆమె కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యిందని సెమ్‌మాన్‌ వైద్య విశ్వవిద్యాలయ అధిపతి నవీద్‌ దనాయీ తెలిపారు.

కొన్నిరోజుల క్రితం ఇరాన్‌లోని కెర్మాన్‌కు చెందిన మరో 91 ఏళ్ల వృద్ధుడు కూడా కరోనా నుంచి కోలుకుని ఆశ్చర్యపరిచాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్రకారం కొవిడ్‌-19 ప్రభావంతో మరణం సంభవించే అవకాశం యవ, మధ్యవయస్కుల్లో 3.4 శాతం ఉంటే.. అదే వృద్ధులలో 21.9 శాతం ఉంటుంది. కరోనా వైరస్‌ కారణంగా ఇరాన్‌లో ఫిబ్రవరి 19న మొదటి మరణం నమోదుకాగా... ఇప్పటి వరకు వెయ్యి మందిని ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని