ఆ విషయంలో ఇండియన్స్‌నే ఫాలో అవుతాం

కరోనా దెబ్బతో అమెరికాలోని సూపర్‌ మార్కెట్లు, నిత్యావసర దుకాణాల్లో టాయిలెట్‌ పేపర్లు, శానిటైజర్ల కొరత ఏర్పడుతోంది. ఖాళీ అల్మరాలు దర్శనమిస్తున్నాయి. స్టోర్లలో వాటికోసం........

Published : 19 Mar 2020 01:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా దెబ్బతో అమెరికాలోని సూపర్‌ మార్కెట్లు, నిత్యావసర దుకాణాల్లో టాయిలెట్‌ పేపర్లు, శానిటైజర్ల కొరత ఏర్పడుతోంది. ఖాళీ అల్మరాలు దర్శనమిస్తున్నాయి. స్టోర్లలో వాటికోసం వ్యక్తుల మధ్య కొద్దిపాటి ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. వారిని అదుపుచేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికా, బ్రిటన్‌ దేశస్థులు కాలకృత్యాలు తీర్చుకున్నప్పుడు నీళ్లకు బదులు టాయిలెట్‌ పేపర్‌ను వాడుతారు. కరోనా ప్రభావంతో వాటి వినియోగం మరింత పెరిగింది. దీంతో వాటి కొరత ఏర్పడడంతో చేసేదేమీలేక భారతీయ పద్ధతిని అనుసరిస్తున్నారు. అందుకోసం కావాల్సిన నీటిపైపులను కొనుగోలు చేస్తున్నారు. చికాగోకు చెందిన 28 ఏళ్ల స్కాక్‌బ్రామే అలాంటి ఒక పైపును కొని తన ట్విట్టర్‌ ఖాతాలో ఉంచి ‘‘ అమెరికా మేధావులారా టాయిలెట్ పేపర్లను అంత పెద్ద మొత్తంలో కొనేకంటే ఒక నీటి పైపును కొనండి చాలు అంటూ రాసుకొచ్చాడు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని