దిల్లీ ఎయిమ్స్‌లో సొంత శానిటైజర్ల వినియోగం

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా మాస్కులు, శానిటైజర్ల కొరతను అధిగమించేందుకు దిల్లీ ఎయిమ్స్‌ నిపుణులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తమ ల్యాబోరేటరీల్లోనే సొంతంగా శానిటైజర్లు, మాస్కులు తయారుచేసి వాటిని ఉపయోగిస్తున్నారు.

Published : 19 Mar 2020 16:30 IST

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా మాస్కులు, శానిటైజర్ల కొరతను అధిగమించేందుకు దిల్లీ ఎయిమ్స్‌ నిపుణులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తమ ల్యాబోరేటరీల్లోనే సొంతంగా శానిటైజర్లు, మాస్కులు తయారుచేసి వాటిని ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆస్పత్రుల్లో వ్యక్తిగత రక్షణ ఉత్పత్తుల(పీపీఈ) కొరత ఏర్పడింది. దీంతో మైక్రో బయాలజీ విభాగానికి చెందిన వైద్యులు ల్యాబోరేటరీలో శానిటైజర్లు, మాస్కులను తయారుచేశారు. ఆస్పత్రి అధికారులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిమ్స్‌ మెడిసిన్‌ ల్యాబోరేటరీ ప్రొఫెసర్‌ పూర్వ మాథుర్ తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్‌ వైద్యులు ఒకరు మాట్లాడుతూ..‘వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులు ఆస్పత్రి పరిపాలనా విభాగం సమకూర్చింది. కానీ అవి సరిపోలేదు. దీంతో మేం ప్రత్యామ్నాయం ఎలా అని ఆలోచించాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఇక్కడే ప్లాస్టిక్‌ మాస్కులు, అల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు రూపొందించాం. ప్రస్తుతానికి మేం 100 ప్లాస్టిక్‌ మాస్కులు, 20 లీటర్ల శానిటైజర్లు తయారు చేశాం’ అని తెలిపారు.  అదేవిధంగా కరోనా వైరస్‌ దృష్ట్యా భద్రతా పరికరాలను మరిన్ని అందజేసేలా చూడాలని ఆస్పత్రి పరిపాలనా విభాగానికి విజ్ఞప్తి చేశామని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి..

చైనాలో తగ్గుముఖం.. ఇతర దేశాల్లో ఉద్ధృతం

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని