గుజరాత్‌లో మరో ముగ్గురికి కరోనా వైరస్‌

గుజరాత్‌లో మరో మూడు కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా వడోదరలో ఒకరు, అహ్మదాబాద్‌లో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జయంతి రవి వెల్లడించారు.

Published : 20 Mar 2020 22:14 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో మరో మూడు కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా వడోదరలో ఒకరు, అహ్మదాబాద్‌లో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జయంతి రవి వెల్లడించారు. వడోదరలో ఇటీవల స్పెయిన్‌ నుంచి తిరిగొచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. అహ్మదాబాద్‌లోని ఇద్దరిలో ఒకరు(34) ఫిన్లాండ్‌ నుంచి, మరొకరు(21) యూఎస్‌ నుంచి తిరిగి వచ్చిన వారిగా గుర్తించారు. వీరితో కలిపి ఇప్పటి వరకు గుజరాత్‌లో కరోనా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది.

‘రోగులందరికీ ప్రోటోకాల్‌ ప్రకారం చికిత్స అందిస్తున్నాం. వారందరి పరిస్థితి నిలకడగానే ఉంది. వారిని క్వారంటైన్‌లో ఉంచాం. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు క్వారంటైన్‌లో ఉండాలి. అలా ఎవరైనా దృష్టికి వస్తే మాకు సమాచారం అందజేయాలి. రేపటి నుంచి అనుమానితులకు విమానాశ్రయాల్లోనే చేతులపై స్టాంప్‌ వేస్తాం. ఎవరికైనా సమాచారం కావాలనుకుంటే 104 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయండి ’ అని జయంతి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే గుజరాత్‌లో జిమ్‌లు, పార్కులు, ఇతర పబ్లిక్‌ ప్రదేశాలు మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని