వాళ్లకు పితృత్వ సెలవులు: గోయల్‌

తల్లి లేని పిల్లల ఆలనా పాలనా చూసే రైల్వేశాఖలో పనిచేసే తండ్రులకు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌......

Published : 20 Mar 2020 22:26 IST

దిల్లీ: తల్లి లేని పిల్లల ఆలనా పాలనా చూసే రైల్వేశాఖలో పనిచేసే తండ్రులకు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ తెలిపారు. పిల్లల సంరక్షణ కోసం ప్రస్తుతం మహిళలకు మాతృత్వ సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే లింగ సమానత్వంలో భాగంగా ఏప్రిల్‌ నుంచి పితృత్వ సెలవులు అమలు చేయనున్నట్లు రాజ్యసభలో ప్రశ్నత్తోరాల సమయంలో గోయల్ వెల్లడించారు. రెండేళ్లపాటు ఈ సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.

‘‘తల్లి లేని పిల్లల తండ్రులకు ఏప్రిల్‌ నుంచి పితృత్వ సెలవులు ఇస్తున్నాం’’ అని గోయల్‌ తెలిపారు. అయితే తొలి ఏడాది సెలవులకు పూర్తి జీతం, రెండో ఏడాదికి 80 శాతం జీతం చెల్లిస్తామన్నారు. తల్లి లేని పిల్లల తండ్రులకు పితృత్వ సెలవులు ఇవ్వాలని 2018 డిసెంబర్‌ 11న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రైల్వేశాఖ అమలు చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని