శానిటైజర్, మాస్క్ ధరలు ఇంతలోపే ఉండాలి..
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తిని ఆసరాగా చేసుకుని శానిటైజర్, మాస్క్‌ల ధరలు చుక్కలనంటుతున్నాయి. రిటైల్ దుకాణాలే కాకుండా ఆన్‌లైన్ సంస్థలు కూడా వీటి రేట్లను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఈ దోపిడీని అరికట్టడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశవాన్ హెచ్చరికలు జారీ చేశారు. 200 ఎంఎల్ శానిటైజర్ బాటిల్ ధర రూ.100, మాస్క్ ధర రూ.10కి మించరాదని ఆయన ప్రకటించారు. ఈ ఆదేశాలు 30 జూన్, 2020 వరకూ అమలులో ఉంటాయని తెలిపారు.
ప్రస్తుతం భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 271కి చేరింది. కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాలంటే చేతులను శుభ్రంగా ఉంచుకోవటం, సామాజిక దూరం పాటించటం అతి ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శానిటైజర్లు, మాస్కులకు డిమాండు విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని వాటి ధరలు పెంచి విక్రయిస్తున్నారంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు మాస్కులు, శానిటైజర్లను 15 రెట్ల అధిక ధరకు కూడా అమ్ముతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వీటి ధరలను నియంత్రిస్తూ కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
RJD: అవును మోదీజీ.. మీరు చెప్పింది నిజమే..ఇప్పుడదే చేశాం..!
-
World News
China: తైవాన్‌పై అవసరమైతే బలప్రయోగం తప్పదు..!
-
India News
Nitish Kumar: ఎనిమిదో సారి.. సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారం
-
Politics News
Kavitha Kalvakuntla: అక్కడ మా ఎమ్మెల్యే లేకపోయినా అభివృద్ధి ఆగలేదు: ఎమ్మెల్సీ కవిత
-
Movies News
Poorna: పెళ్లి క్యాన్సిల్ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!
-
India News
Kashmir: స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల వేళ.. భారీ ఉగ్రకుట్ర భగ్నం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..