సెంట్రల్‌ జైలుకు నిప్పంటించిన ఖైదీలు

వెంటనే బెయిల్‌పై బయటికి పంపించి తమను కరోనా వైరస్‌ నుంచి కాపాడాలని కోల్‌కతాలోని దమ్‌దమ్‌ కేంద్ర ఖారాగారంలోని ఖైదీలు అధికారులను డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలు.....

Updated : 22 Mar 2020 02:05 IST

కోల్‌కతా: వెంటనే బెయిల్‌పై బయటికి పంపించి తమను కరోనా వైరస్‌ నుంచి కాపాడాలని కోల్‌కతాలోని దమ్‌దమ్‌ కేంద్ర ఖారాగారంలోని ఖైదీలు అధికారులను డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కొంతమంది ఖైదీలు జైలు అధికారులపై దాడికి పాల్పడ్డట్లు సమాచారం. ఈక్రమంలో పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. ఈ దాడిలో పలువురు ఖైదీలు గాయాల పాలయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఓ అధికారి తెలిపారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించాలన్న ఉద్దేశంలో జైలులో ములాఖత్‌ను గత శుక్రవారం జైలు అధికారులు రద్దు చేశారు. మార్చి 31 వరకు ఎలాంటి ములాఖత్‌లు ఉండవని పేర్కొన్నారు. ఇదే క్రమంలో పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన వారు, సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలకు 15 రోజుల పెరోల్ ఇవ్వడానికి జైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం కొంతమంది ఖైదీలకు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. ఆగ్రహం తట్టుకోలేకపోయిన ఖైదీలు జైలుకు నిప్పింటించేందుకు యత్నించారు. వెంటనే అగ్నిమాపక యంత్రాల సాయంతో అధికారులు మంటలు ఆర్పివేసినట్లు సమాచారం.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని