జనతా కర్ఫ్యూతో కరోనాను జయిస్తాం!

కంటికి కనపడని కరోనా వైరస్‌ మహమ్మారితో యావత్తు ప్రపంచం యుద్ధమే చేస్తోంది. ప్రతిరోజు వేల మందిని పొట్టనబెట్టుకుంటూ మానవ మేధస్సుకు...

Updated : 22 Mar 2020 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కంటికి కనపడని కరోనా వైరస్‌ మహమ్మారితో యావత్తు ప్రపంచం యుద్ధమే చేస్తోంది. ప్రతిరోజు వేల మందిని పొట్టనబెట్టుకుంటూ మానవ మేధస్సుకు సవాల్‌ విసురుతున్న కొవిడ్‌-19ను ఓడించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో మానవాళి పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన ‘జనతాకర్ఫ్యూ’కి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. వైరస్‌ వ్యాప్తి గొలుసుకట్టును తుంచి దాని పని పట్టేందుకు యావత్‌ భారతం కంకణం కట్టుకుంది. ప్రధాని ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపును స్వాగతించి ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. జనసమ్మర్ధంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు ఆదివారం ఉదయం నుంచి బోసిపోతున్నాయి. రాజధాని దిల్లీతో పాటు దేశంలోని ప్రముఖ నగరాల్లో వీధులు ఎడారులను తలపిస్తున్నాయి.

జన సంచారం లేక బోసి పోతున్న లక్నోలోని ఓ వీధి

ఖాళీగా దర్శనమిస్తున్న దిల్లీలోని ఎయిమ్స్‌ పైవంతెన

రోడ్లపై జన సంచారం లేకపోవడంతో ముంబయిలో ఓ మురికివాడ సమీపంలో నిలిపి ఉంచిన ఆటోలు

‘జనతాకర్ఫ్యూ’ సందర్భంగా గువాహటిలో నిలిచిన బస్సు సేవలు

నిర్మానుష్యంగా మారిన ముంబయిలోని జె.జె పైవంతెన

ముంబయిలోని తాజ్‌ హోటల్‌ వద్ద..

చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద ఇలా..

చెన్నైలోని ఓ మెట్రో స్టేషన్‌ను శుభ్రం చేస్తున్న కార్మికురాలు

దిల్లీలో ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌ సమీపంలో ఖాళీగా దర్శనమిస్తున్న రోడ్డును దాటుతున్న వానరం 

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇలా..

నిర్మానుష్యంగా పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జి 

భారత దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో..

ముంబయిలో నిలిచిన రైల్వే సర్వీసులు

జన సంచారం లేని శ్రీనగర్‌లోని ఓ రహదారి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్మానుష్య రహదారిని దాటుతున్న శునకం

కోల్‌కతాలోని హౌరా రైల్వే స్టేషన్‌ వద్ద ఇలా..

హైదరాబాద్‌ పాతబస్తీలోని మక్కా మసీదు వద్ద కరోనా వైరస్‌ నిర్మూలనకు క్రిమి సంహార మందును వెదజల్లుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సభ్యుడు

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని