కరోనా పోరాట యోధులపై మోదీ ప్రశంసలు

ప్రధాని మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపును స్వాగతించి ప్రజలంతా నేడు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్‌ను ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇళ్లలో తమ సమయాన్ని ఎలా వెళ్లదీస్తున్నారో వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Published : 22 Mar 2020 17:56 IST

దిల్లీ: ప్రధాని మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపును స్వాగతించి ప్రజలంతా నేడు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్‌ ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇళ్లలో తమ సమయాన్ని ఎలా వెళ్లదీస్తున్నారో వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. వీటన్నింటిని చూసిన ప్రధాని మోదీ వారి ఆలోచనలు, వినూత్న ప్రయోగాలను ట్విటర్‌ వేదికగా అభినందిస్తున్నారు. వారు చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నారు. కొవిడ్‌-19ను ఓడించేందుకు ప్రతి భారతీయుడు ఓ సైనికుడిగా మారాడని కొనియాడారు. ప్రజల అప్రమత్తత, జాగరూకత లక్షల మంది జీవితాలను నిలపడంలో సాయంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

* వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు డిజిటల్‌ పేమెంట్స్‌ సాధనాల్ని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తూ ఓ నిపుణుడు చేసిన వీడియోను ప్రధాని షేర్‌ చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.

* మరొకరు ప్రకృత్తిని ఆస్వాదిస్తూ పెరట్లో ఉన్న మొక్కలు, వాటికి పూసిన పూలను కెమెరాలో బందిస్తూ సరదాగా గడిపారు. సమయాన్ని ఇలాంటి పనులకు వినియోగించుకోవాలన్న ఆలోచన ప్రశంసనీయం అని అభినందించారు.

* మీడియాలో పనిచేస్తున్న ఓ మహిళ జనతా కర్ఫ్యూలో భాగంగా ఇంటి నుంచే పని చేస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆమె పోస్ట్‌ను ప్రధాని మోదీ షేర్‌ చేశారు. ‘మీడియా ద్వారా వార్తలు అందజేయడమే కాకుండా.. ఆమె ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకోవడం’ ఎంతో గొప్ప విషయమని మోదీ ఆమెను ప్రశంసించారు.

* ‘కొన్ని గంటలుగా జనతా కర్ఫ్యూ కొనసాగుతుండడంతో ఎక్కడ చూసినా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. దీంతో పక్షుల శబ్దాలు ఎంతో స్పష్టంగా వినిపిస్తున్నాయి. మీరూ వినొచ్చు’ అంటూ ఓ వ్యక్తి ఇంట్లో నుంచి పక్షుల శబ్దాలను వీడియో తీసి ట్వీట్‌ చేశారు. ఈ పోస్ట్‌ను మోదీ షేర్‌ చేస్తూ.. కర్ఫ్యూలో భాగంగా అతడు చేసిన ప్రయత్నాన్ని అభినందించారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని