మరో 18 నెలలు ఇబ్బందిలేదు..

భారత్‌లోని పేదలకు మరో ఏడాదిన్నర పాటు ఆహారధాన్యాలకు ఇబ్బందిలేకుండా రిజర్వులు ఉన్నాయని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ డి.వి.ప్రసాద్‌ తెలిపారు. ఏప్రిల్‌ చివరి నాటికి ప్రభుత్వ గోదాముల్లో దాదాపు

Published : 25 Mar 2020 01:35 IST

దిల్లీ: భారత్‌లోని పేదలకు మరో ఏడాదిన్నర పాటు ఆహారధాన్యాలకు ఇబ్బందిలేకుండా రిజర్వులు ఉన్నాయని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ డి.వి.ప్రసాద్‌ తెలిపారు. ఏప్రిల్‌ చివరి నాటికి ప్రభుత్వ గోదాముల్లో దాదాపు 100 మిలియన్‌ టన్నుల ఆహారధాన్యాలు  ఉంటాయి. మన దేశంలో పేదల వార్షిక అవసరాలకు 50 మిలియన్‌ టన్నుల నుంచి 60 మిలియన్‌ టన్నులు సరిపోతాయి. 2019-20 వార్షిక సంవత్సరానికి భారత్‌ రికార్డు స్థాయిలో 292 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేస్తుందని అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి గత ఏడాది కంటే ఈ సారి అధికంగా పండనున్నాయి. 
‘‘ ఆహార ధాన్యాల కొరతగురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని ప్రాంతాలకు అవసరమైన గోధుమలు, బియ్యం ఉన్నాయి’’ అని ప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రజా పంపిణీ ద్వారా ఆహార ధాన్యాలు పొందుతున్న వారు ఆరునెలలకు సరిపడా ముందే కొనుగోలు చేసుకోవచ్చని ఆహారశాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ పేర్కొన్నారు. చైనా కూడా తమ దేశంలో ఈ వైరస్‌ ప్రబలినప్పుడు ఆహార సంక్షోభం రాకుండా చర్యలు తీసుకొంది.  దీంతోపాటు ఉత్పత్తిని కూడా పెంచేందుకు జాగ్రత్తలు తీసుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని