‘వైద్యులు చెప్పారని అమెరికా షట్‌డౌన్‌ చేయను’

దేశం మొత్తాన్ని షట్‌డౌన్‌ చేయాలన్న వైద్యుల సూచనను పాటించనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంటున్నారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం అలాచేస్తే ఆర్థిక వ్యవస్థ పెను ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ‘మర్చిపోవద్దు. ఈ విషయాన్ని వైద్యులకే వదిలేస్తే దేశం మొత్తం షట్‌డౌన్‌ చేయమంటారు.....

Updated : 24 Mar 2020 15:32 IST

వాషింగ్టన్‌: దేశం మొత్తాన్ని షట్‌డౌన్‌ చేయాలన్న వైద్యుల సూచనను పాటించనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంటున్నారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం అలాచేస్తే ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ‘మర్చిపోవద్దు. ఈ విషయాన్ని వైద్యులకే వదిలేస్తే దేశం మొత్తం షట్‌డౌన్‌ చేయమంటారు. అలాగైతే ప్రపంచమంతా షట్‌డౌన్‌ చేయాలి. అంటే దాదాపు 150 దేశాలు షట్‌డౌన్‌ అవ్వాలి’ అని సోమవారం వైట్‌హౌజ్‌లో ట్రంప్‌ అన్నారు.

‘షట్‌డౌన్‌ చేస్తే బాగానే ఉంటుంది. అయితే దానిని రెండేళ్లు కొనసాగిద్దామా! అది కుదరదని మీకూ తెలుసు. ఏ దేశంలోనూ ఆ పని చేయరు. ప్రత్యేకించి ప్రపంచ నంబర్‌ వన్‌ ఆర్థిక వ్యవస్థలో అస్సలు కుదరదు’ అని ట్రంప్‌ అన్నారు. ఇప్పటికే అమెరికాలో 43,700 మందికి కొవిడ్‌-19 సోకగా 550 మంది మరణించారు. ఒక్క న్యూయార్క్‌లోనే 157 మంది మృత్యువాత పడ్డారు.

‘షట్‌డౌన్‌ చేస్తే అసలు సమస్య కన్నా ఇతర సమస్యలు పెరుగుతాయి. ఈ రెండు వారాల్లో మనం మెరుగయ్యాం. సమస్య ఇప్పటికప్పుడే తగ్గిపోతుందని చెప్పను. అయితే ఈ పోరాట సమయంలో మనమెన్నో విషయాలు నేర్చుకుంటాం. భవిష్యత్తులో ఇది మనకు ఉపయోగపడుతుంది. న్యూయార్క్‌, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌, ఇల్లినాయిస్‌లో క్వారంటైన్‌ చేద్దాం’ అని ట్రంప్‌ అన్నారు.

‘చాలా ప్రాంతాల్లో కొవిడ్‌-19 లేదు. కొన్ని చోట్ల నామమాత్రంగా ఉంది. అలాంటప్పుడు దేశమంతా ఎందుకు లాక్‌డౌన్‌ చేయాలి. న్యూయార్క్‌లో స్టాక్‌మార్కెట్‌ నడుస్తోంది. వారు చక్కగా పనిచేస్తున్నారు. అన్నీ మూసేసి అద్భుతంగా ఉందని చెప్పలేం. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరణాలు సంభవిస్తాయి’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని