గ్రెటా థన్‌బర్గ్‌కు కరోనా వైరస్‌ సోకిందా?

తనకు కరోనా వైరస్‌ సోకే అవకాశం చాలా ఎక్కువగానే ఉందని ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్‌బర్గ్‌ ప్రకటించుకున్నారు. ఇటీవలే తాను సెంట్రల్‌ ఐరోపా ప్రాంతంలో పర్యటించి వచ్చినట్లు తెలిపారు..........

Published : 25 Mar 2020 10:30 IST

స్టాక్‌హోం: తనకు కరోనా వైరస్‌ సోకే అవకాశం చాలా ఎక్కువగానే ఉందని ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్‌బర్గ్‌ ప్రకటించుకున్నారు. ఇటీవలే తాను సెంట్రల్‌ ఐరోపా ప్రాంతంలో పర్యటించి వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వైరస్‌ తనకు సోకే ప్రమాదం లేకపోలేదని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. పది రోజుల క్రితం కొన్ని లక్షణాలు తనలో కనిపించినట్లు తెలిపారు. జలుబు, గొంతునొప్పి, జ్వరం, దగ్గు వంటి ఇబ్బందులు తలెత్తాయన్నారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న సెంట్రల్‌ యూరప్‌లో పర్యటించడం, తాజాగా లక్షణాలను బట్టి చూస్తే వైరస్‌ సోకే అవకాశం లేకపోలేదని భావిస్తున్నానన్నారు. ముందు జాగ్రత్తగా తన తండ్రితో పాటు తాను స్వీయ నిర్బంధంలో ఉన్నామన్నారు. స్వీడన్‌లో తీవ్ర అనారోగ్యానికి గురైతే తప్ప పరీక్షలు చేయట్లేదని.. కాబట్టి తాను ఇంకా కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకోలేదన్నారు. 

ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడిందని థెన్‌బర్గ్‌ తెలిపారు. అయితే, ఇతరుల్ని హెచ్చరించడానికే తాను ఈ విషయాన్ని బయటకు వెల్లడించానని తెలిపారు. చాలా మంది ముఖ్యంగా యువకుల్లో లక్షణాలు పెద్దగా బయటకు కనిపించడం లేదని వివరించారు. దీని వల్ల వైరస్‌ ఇతరులకు చాలా సులువుగా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మనం తీసుకునే జాగ్రత్తలే మన చావు, బతుకులను నిర్ణయించబోతున్నాయని హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని