పర్వదినాలున్నా పోరాడుతూనే ఉందాం:మోదీ

నేడు దేశంలో పలు రాష్ట్రాల్లో వివిధ పర్వదినాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన......

Published : 25 Mar 2020 11:11 IST

 

దిల్లీ: నేడు దేశంలో పలు రాష్ట్రాల్లో వివిధ పర్వదినాలు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆయన ప్రజలు సుఖసంతోషాలు, ఆరోగ్యంతో జీవించాలని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్‌ చేయడం విశేషం. ‘‘ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి.. కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను’’ అని ట్విటర్‌లో మోదీ రాసుకొచ్చారు. మహారాష్ట్ర ప్రజలకు గుడి పడ్వా, కశ్మీర్‌ ప్రజలకు నవ్‌రే, కర్ణాటక ప్రజలకు ఉగాది, మణిపూర్‌ వాసులకు సజిబు శైరోబా పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.

కొవిడ్‌-19 మహమ్మారి దేశ ప్రజల్ని పీడిస్తున్న సమయంలో ఈ పర్వదినాలు జరుపుకొంటున్నామని మోదీ గుర్తుచేశారు. ఎప్పటిలా ఈయేడు పండగల్ని జరుపుకొనే పరిస్థితులు లేవని..కానీ, మన మనోస్థైరాన్ని పెంచేందుకు ఇలాంటి పర్వదినాలు ఉపయోగపడతాయన్నారు. నేటి నుంచి నవరాత్రి పర్వదినాలు కూడా ప్రారంభమవుతున్న సందర్భంగా.. ప్రజలతో పాటు ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తానన్నారు. అందరం కలిసి వైరస్‌పై పోరును కొనసాస్తూనే ఉందామని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని