స్వదేశానికి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇరాన్‌లో తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో ఇరాన్‌లో 143 మంది మరణించినట్లు అక్కడి.....

Published : 25 Mar 2020 16:37 IST

జోధ్‌పూర్‌: ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇరాన్‌లో తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో ఇరాన్‌లో 143 మంది మరణించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2,077కి చేరింది. ఇప్పటికే ఇరాన్‌లో 27వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఈ సమయంలో వివిధ కారణాలతో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం పలు విడుతల్లో స్వదేశానికి తీసుకొచ్చింది. తాజాగా ఈ ఉదయం ఇరాన్‌లో చిక్కుకున్న మరో 277మంది భారతీయులను స్వదేశానికి తరలించింది. వీరిలో 128 మంది పురుషులు, 149 మంది మహిళలు ఉన్నారు. యాత్రికులే ఎక్కువగా ఉన్న ఈ బృందం మహాన్ విమానంలో ఈ ఉదయం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి అక్కడే ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహించిన రాజస్థాన్‌ అధికారులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్మీ వెల్‌నెస్‌ కేంద్రానికి తరలించారు. అక్కడే వీరందరినీ ప్రత్యేక పరీశీలనలో ఉంచుతున్నామని అధికారులు పేర్కొన్నారు. వీరికోసం అన్ని వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీరి గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులతో పంచుకుంటున్నామని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని