కరోనాపై యుద్ధానికి జీ-20 నేతల సమావేశం

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణపై చర్చించేందుకు... భారత ప్రధాని మోదీ సహా జీ-20 దేశాధినేతలు అత్యవసరంగా సమావేశం కానున్నారు. గురువారం దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించే సమావేశం (వీడియో కాన్ఫరెన్స్‌)లో వీరంతా పాల్గొంటారు. అసాధారణ రీతిలో....

Published : 26 Mar 2020 02:17 IST

 దృశ్య మాధ్యమం ద్వారా అత్యవసర భేటీ
 పాల్గొననున్న ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణపై చర్చించేందుకు... భారత ప్రధాని మోదీ సహా జీ-20 దేశాధినేతలు అత్యవసరంగా సమావేశం కానున్నారు. గురువారం దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించే సమావేశం (వీడియో కాన్ఫరెన్స్‌)లో వీరంతా పాల్గొంటారు. అసాధారణ రీతిలో తలపెట్టిన ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌ నేతృత్వం వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలపైనా, ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారిని నిరోధించేందుకు... సమన్వయంతో ఎలా పనిచేయాలన్న విషయమై వీరంతా చర్చిస్తారు. జీ-20 సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని, కొవిడ్‌-19 మహమ్మారి నివారణకు అంతర్జాతీయంగా ఎలాంటి పాత్ర పోషించాలన్న విషయమై ఈ సందర్భంగా చర్చిస్తామని మోదీ ట్వీట్‌ చేశారు. ఇందులో ‘జీ-20’ నేతలతో పాటు... ఆహ్వానిత దేశాలైన స్పెయిన్‌, జోర్డాన్‌, సింగపూర్‌, స్విట్జర్లాండ్‌ ప్రతినిధులు; ఐరాస, ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ బోర్డు, ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌, ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌, ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని