తెలంగాణాలో కరోనాపరీక్ష: ల్యాబ్‌లు ఎక్కడంటే...

దేశంలోని వివిధ రాష్ట్రాలలో మరో 19 ప్రైవేటు కరోనా పరీక్ష ల్యాబొరేలరీలకు ఇండియన్‌ కౌన్సిల్ ఆఫ్ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతినిచ్చింది.

Published : 27 Mar 2020 18:00 IST

దేశవ్యాప్తంగా మొత్తం 35 ప్రైవేటు ల్యాబ్‌లు

దిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలలో మరో 19 ప్రైవేటు కరోనా పరీక్ష ల్యాబొరేలరీలకు ఇండియన్‌ కౌన్సిల్ ఆఫ్ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతినిచ్చింది. ఈ మేరకు గురువారం నాడు వెలువరించిన ప్రకటన ప్రకారం... దిల్లీ (6), మహారాష్ట్ర (9), గుజరాత్‌ (4), హరియాణా (3), కర్ణాటక (2), ఒడిశా (1), తమిళనాడు (4) పశ్చిమ బెంగాల్‌ (1)తో పాటు తెలంగాణాలో ఈ కింది సంస్థలకు అనుమతి లభించింది.

తెలంగాణాలో ప్రభుత్వ కరోనా పరీక్ష ల్యాబొరేటరీలు

1. గాంధీ మెడికల్‌ కాలేజ్‌, సికింద్రాబాద్‌ 
2. ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌
3. సర్‌ రొనాల్డ్‌ రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ట్రాపికల్‌ అండ్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌, హైదరాబాద్‌
4. నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌, హైదరాబాద్‌
5. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ప్రివెంటివ్‌ మెడిసిన్‌, హైదరాబాద్‌

తెలంగాణాలో ప్రైవేటు కరోనా పరీక్ష ల్యాబొరేటరీలు

1. అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌
2. విజయ డయాగ్నొస్టిక్స్‌ 
సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హిమాయత్‌ నగర్‌, హైదరాబాద్‌
3. వింతా ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, చెర్లపల్లి, హైదరాబాద్‌
4. అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ లిమిటెడ్‌, బోయిన్‌పల్లి, హైదరాబాద్‌
5. డా. రెమిడీస్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌

తాజా అనుమతులతో భారత్‌లో మొత్తం ప్రైవేటు ల్యాబ్‌ల సంఖ్య 35కు చేరింది. కరోనా అనుమానితులను చేర్చుకున్న ఆస్పత్రులు వారి ముక్కు, గొంతు నుంచి నమూనాలను సేకరించి సమీపంలోని కరోనా పరీక్ష ల్యాబ్కు అందజేయాలని ఐసీఎంఆర్ ఆదేశాలు జారీ చేసింది. సదరు పరీక్షల నిర్వహణకు అనుమతి గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కరోనా నిర్ధారణ ల్యాబ్‌ల వివరాలను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. అంతేకాకుండా ప్రజలు తమ సమీపంలోని కరోనా ల్యాబ్‌లను గూగుల్‌ మ్యాప్‌ ద్వారా కూడా కనుగొనవచ్చని సంస్థ వివరించింది.

దేశవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌ల గురించి క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని