కరోనాపై అనుచిత పోస్ట్‌.. ఉద్యోగం ఊడింది

కరోనా వైరస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముజీబ్‌ మహ్మద్‌ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వైరస్‌.........

Updated : 28 Mar 2020 13:12 IST

బెంగళూరు: కరోనా వైరస్‌ నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముజీబ్‌ మహ్మద్‌ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వైరస్‌ వ్యాప్తికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తద్వారా ప్రజల్లో భయాందోళనలు నెలకొల్పేందుకు యత్నించాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. అతను ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో వెంటనే విషయాన్ని కంపెనీకి తెలియజేశారు. కంపెనీ యాజమాన్యం కూడా వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ధ్రువీకరించుకొని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అతనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సంస్థ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేసింది.

రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని ఉద్ధృతం చేస్తున్న కరోనాపై అనవసర వదంతులు వ్యాప్తి చేస్తే సహించేది లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా కొంతమంది ఆకతాయిలు, బాధ్యతారాహిత్యంతో సృష్టిస్తున్న వదంతుల వల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంటోంది. ఇలాంటి అర్థంలేని ఊహాగానాలు, అనుచిత వ్యాఖ్యలు విపరీత పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే వీటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించింది.

ఇవీ చదవండి..

ఒక్కరోజే 14 కరోనా కేసులు

రోగ నిరోధకత ఉంటే కరోనాను జయించొచ్చు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని