కరోనాను ఎదుర్కొనేందుకు 11 బృందాలు

కొవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం 11 సాధికారిక బృందాలను ఏర్పాటు చేసింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం బృందాల ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని కార్యాలయం,

Updated : 30 Mar 2020 05:01 IST

దిల్లీ: కొవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం 11 సాధికారిక బృందాలను ఏర్పాటు చేసింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం బృందాల ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని కార్యాలయం, కేబినెట్ సచివాలయంలో ఉన్న సీనియర్ అధికారులతో కలిపి ఈ బృందాలను ఏర్పాటు చేశారు. కొవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం, సమయానుసారంగా అమలు చేయడానికి అన్నిరకాల చర్యలు తిసుకునే అధికారం కేంద్రం ఈ బృందాలకు ఇచ్చింది. నిత్యావసరాలు సహా అన్ని సేకరణ విషయాలలో ఈ బృందాలు త్వరితగతిన నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రధాని కార్యాలయం, కేబినెట్ సచివాలయం ఈ కమిటీలు ఎప్పటికప్పుడు సమన్వయ పరచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో 8 బృందాలకు కార్యదర్శి స్థాయి అధికారులు, రెండు బృందాలకు నీతి ఆయోగ్ సభ్యులు, ఒక బృందానికి నీతి ఆయోగ్ సీఈఓ నేతృత్వం వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని