క్వారంటైన్‌లోకి ఇజ్రాయిల్‌ ప్రధాని 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్‌ దేశాధినేతలను విడిచిపెట్టడంలేదు. తాజాగా ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహు ప్రధాన

Published : 30 Mar 2020 17:50 IST

జెరూసలెం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్‌ దేశాధినేతలను విడిచిపెట్టడంలేదు. తాజాగా ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహు ప్రధాన సహాయకుడికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ముందస్తు చర్యగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు. గతవారం పార్లమెంట్‌ సెషన్స్‌కు హాజరైన బెంజిమన్‌ ప్రతిపక్షసభ్యుల సలహాలు తీసుకుని కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొనాలనే దానిపై ప్రణాళిక చేశారు. ఆయన సహాయకుడికొ కరోనా ఛాయలు కనిపించడంతో ఆయనతో పాటు మిగతా సహాయక సిబ్బంది కూడా ఐసోలేషన్‌కు వెళ్లినట్టు స్థానిక మీడియా జెరూసలెం పోస్టు తెలిపింది. అయితే బెంజిమన్‌ క్వారంటైన్‌కు వెళ్లారనే వార్తలను ప్రధాని కార్యాలయం ఖండించింది. ఇప్పటికే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌జాన్సన్‌, ఆ దేశ ఆర్థిక మంత్రి, కెనడా ప్రధాని భార్య ఈ వైరస్‌ బారినపడ్డారు. స్పెయిన్‌ యువరాణి మృత్యవాతపడింది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్‌లో 4347 మందికి కొవిడ్‌-19 వైరస్‌ సోకగా వీరిలో 15 మరణించారు. 132 మంది కోలుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని